టాలీవుడ్ లో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరంటే పూజ హెగ్డే అని చెప్పాలి.. టాలీవుడ్ లో చేసిన తొలి సినిమా తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయినా ఈ అమ్మడు మళ్ళీ తెలుగులో సినిమాలు చేస్తూ టాప్ చైర్ లో కూర్చుంది అని చెప్పొచ్చు. నాగ చైతన్య ఒక లైలా కోసం సినిమా తో టాలీవుడ్ కి పరిచయమై ఆ తరవాత పెద్దగా కనిపించలేదు.. అప్పుడే ముకుంద సినిమా చేసినా ఆ సినిమా పెద్ద గా ఆడకపోవడంతో ఆమె పేరు పెద్దగా వినిపించలేదు.. మళ్ళీ ఆమె బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్ తో సినిమా చేసి దువ్వాడ జగన్నాధం తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది దాని తర్వాత ఆమె వెను తిరగలేదనే చెప్పాలి.