టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత హీరో గా చేసి చాలా డౌన్ అయిపోయిన సంగతి అందరికి తెలిసిందే.. కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరో గా మారి కొన్ని సినిమాలు హిట్ కొట్టినా ఆ తర్వాత అన్ని ఫ్లాప్ సినిమాలు చేసి దారుణమైన ఇమేజ్ ని మూటగట్టుకున్నాడు.. ఇప్పుడు హీరో గా, కమెడియన్ గా రెండు విధాలుగా సునీల్ కి చేతిలో పెద్దగా సినిమాలు లేవని చెప్పాలి.. రెండు రకాల పాత్రలు చేస్తేనన్నా ఎదో ఒక రూట్లో సెట్ అయ్యేవాడు కానీ కమెడియన్ గా మానేసి హీరో గా చేయడంతో ప్రజలు ఆయన్ని పెద్ద గా రిసీవ్ చేసుకోలేకపోయారు.. అయన హీరో గా చేసిన అందాల రాముడు , మర్యాద రామన్న సినిమాలు తప్పా ఒక్క సినిమాకూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే చెప్పాలి..