నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. BB3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇద్దరికీ తప్పక హిట్ పడాల్సిన సినిమా కావడంతో ఎంతో జాగ్రత్తగా సినిమాపై నిర్ణయాలు తీసుకుంటున్నారు.. కథ విషయంలోనే ఈ సినిమా ను చాలా రోజులు కసరత్తులు చేశారు. గతంలో తమ కాంబో లో వచ్చిన సింహ,లెజెండ్ సినిమాలకు మించి ఈ సినిమా చేయాలనీ అనుకుని టైం తీసుకుంటున్నారు.. ఇప్పటికే ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అటు బోయపాటి శ్రీను కూడా 'వినయ విధేయ రామ' చిత్రంతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు.