RX100 సినిమాతో టాలీవుడ్ కి పాయల్ రాజ్ పుత్ రూపంలో మంచి నటి దొరికిందని చెప్పొచ్చు.. తొలి సినిమా తోనే నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసి ఆమె పెద్ద సాహసమే చేసిందని చెప్పొచ్చు.. ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేయడానికి ఇష్టపడే హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో అరంగేట్రమే ఇలాంటి పాత్ర చేసిన ఆమె ధైర్యం మెచ్చుకోవచ్చు.. అయితే పాయల్ కి తొలి సినిమా తో పది సినిమాలు చేసినా రాని గుర్తింపు దక్కించుకుంది.. అందచందాలతో కవ్విస్తూ నటనతో మెప్పించే అమ్మాయి గా టాలీవుడ్ లో ఆమెకు కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి.. వెంకీ మామ సినిమా లో వెంకటేష్ జోడిగా చేసినా ఆమె రవితేజ డిస్కో రాజా లోనూ హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది.