బెల్లంకొండ సురేష్ వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు శీనుతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరసగా పరాజయాలు ఎదురైనా పట్టువదలకుండా సినిమాలు చేస్తూ ఎట్టకేలకు రీమేక్ మూవీ రాక్షసుడుతో హిట్టు కొట్టడం ఫైనల్ గా ఊరట కలిగించింది. మధ్యలో వచ్చిన జయ జానకి నాయక సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా వొయిలెన్స్ ఎక్కువయిందని ప్రేక్షకులు కొంత నిరుత్సాహం చెందారు.. ఆ తర్వాత వచ్చిన సినిమాతో శ్రీనివాస్ ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. దాంతోఈ సారి సేఫ్ గా రీమేక్ ని నమ్ముకుని హిట్ కొట్టాడు..