క్లాసిక్ సినిమా భారతీయుడు సినిమా కి శంకర్ సీక్వెల్ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.. కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఈ సినిమా లో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా హీరోలు శింబు, సిద్ధార్థ్ లు ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఇక అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. అయితే ఈ సినిమా ని ఏ ముహూర్తాన మొదలుపెట్టాడొ తెలీదు కానీ ఆదినుంచి ఈ సినిమాకి అన్ని అడ్డంకులు వస్తున్నాయి.. మొదట్లో నిర్మాతలకు, శంకర్ చెడింది.. ఆ తర్వాత అన్ని సమస్యలు సద్దుమణిగి సినిమా షూటింగ్ మొదలైంది.. ఆ తర్వాత సినిమా లో జరిగిన ఓ ప్రమాదం లో ఇద్దరు సినీ కార్మికులు చనిపోయారు.. దాంతో ఈ సినిమాలోని విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి..