పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా పైనే ఇప్పుడు అందరి అంచనాలు ఉన్నాయి.. పవన్ కళ్యాణ్ చాల రోజుల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు పవన్ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు చూస్తున్నారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ కరోన తర్వాత ఇటీవలే పున: ప్రారంభం అయ్యింది. చాల రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.. తొందర్లోనే పవన్ కళ్యాణ్ సినిమా చూడొచ్చు అనే ఉత్సాహం వారిలో కనిపిస్తుంది. 'వకీల్ సాబ్' లో పవన్ తనకు సంబంధించిన షూటింగ్ కేవలం పది రోజుల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. మిగతా షూటింగ్ కూడా డిసెంబర్ మూడో వారానికి పూర్తయ్యేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుందని సమాచారం. దీనిని బట్టి చూస్తే 'వకీల్ సాబ్' సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.