కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించిన సినిమా రెడ్.. ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ కొట్టిన రామ్ చేస్తున్న తదుపరి సినిమా రెడ్.. ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ ఈ సినిమా పై మంచి అంచనాలే పెట్టుకున్నాడు.. వీరి కాంబో లో వస్తున్న మూడో సినిమా కాగ గత రెండు చిత్రాలు హిట్ అవడంతో ఈ చిత్రం తో హ్యాట్రిక్ హిట్ కొడదాం అనుకున్నారు.. కానీ కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ కి అడ్డు పడింది..ఇప్పటివరకు థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమా కూడా రిలీజ్ కాకుండా పోయింది.. ఓ దశలో ఈ సినిమా OTT లో రిలీజ్ చేయాలనీ చూశారు.. కానీ ఎందుకో కుదరలేదు.. చివరికి ఈ సినిమా ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ భావించారు.