మన తెలుగు సినిమా లో కథానాయకుడు ఎలా ఉన్నా పర్వాలేదు కాని ప్రతినాయకుడు మాత్రం ఓ రేంజ్ లో ఉండాలి. కండలు తిరిగిన బాడీ, కోరమీసం, సిక్స్ ప్యాక్ శరీరం, ఉగ్రమైన కళ్ళు ఇలా ప్రతి ఒక్కటి హీరో కన్నా ఎక్కువ ఉండాలి.. కానీ హీరో కొడితే మాత్రం పడిపోవాలి.. ఇది తెలుగు సినిమాల్లో ఎప్పటినుంచి వస్తున్న సంప్రదాయం.. ఇదివరకు ప్రతినాయక పాత్రలకు స్పెషల్ గా కొంతమందిని ఎంపిక చేసుకుని వారినే కొనసాగించేవారు కాని ఇప్పుడు అలా కాదు, కథ నచ్చితే స్టార్ హీరో అయినా విలన్ గా కనిపించడానికి వెనుకాడట్లేదు.. అందుకోసం కొంత ప్రత్యేకంగా బాడీ పై దృష్టి పెడితే సరిపోతుంది..