న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆయన గత సినిమా లు అనుకున్నంత ఆడకపోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నాడు నాని.. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ తర్వాత శివ చేస్తున్న సినిమా కావడంతో తప్పకుండా హిట్ అవుతుందని అనుకుంటున్నారు చిత్ర బృందం మొత్తం. ఇక ఈ సినిమా తో పాటే నాని శ్యామ్ సింగ్ రాయ్ అనే సినిమా ను కూడా చేస్తున్నాడు.. విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా చేసిన రాహుల్ ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా నిర్మాత అయినా సూర్య దేవర నాగవంశీ ఇప్పటికే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.. దాంతో ఈ సినిమా ని నాని వేరే నిర్మాత కు అప్పగించాడు..