భలే మంచి రోజు చిత్రంతో తెలుగు తెరపై మంచి నటుడిగా పేరు తెక్చుకుని తెలుగు లో పలు సినిమాలు చేశాడు సుధీర్ బాబు. అయితే సమ్మోహనం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పొచ్చు.. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుధీర్ బాబు కి తాను చేసిన సినిమాలో ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.. మిగితా సినిమాలు పర్వాలేదనిపించుకున్నా సుధీర్ అనే ఒక హీరో ఉన్నాడు అని తెలియజేసేలా చేసింది సమ్మోహనం. ఇక బాలీవుడ్ లో భాగీ చిత్రం చేసి మరింత సుపరిచితుడయ్యాడని చెప్పొచ్చు.. తెలుగు లో వచ్చిన వర్షం సినిమా ని బాలీవుడ్ లో రీమేక్ చేయగా గోపీచంద్ చేసిన విలన్ పాత్రను సుధీర్ బాబు చేయడం విశేషం.