టాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకులు చాలా తక్కువ ఉన్నారని చెప్పొచ్చు.. తొలి సినిమా హిట్ కాగానే ఆగని డైరెక్టర్స్ రెండో సినిమాతోనే తుస్ మనిపిస్తారు. కానీ సినిమా సినిమా కి ఎదుగుతూ ఒదిగి ఉంది మళ్ళీ మళ్ళీ హిట్ కొట్టడం కొద్దీ మంది డైరెక్టర్ లేక్ చెల్లుతుంది.. అలాంటి వారిలో ఒకరు అనిల్ రావిపూడి. కమర్షియల్ సినిమాల్లో కామెడీ ని జోడించి సినిమాని హిట్ చేయాలంటే అది ఒక్క అనిల్ రావిపూడి కే సాధ్యం.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పటాస్ సినిమా హిట్ రావడంతోనే టాలీవుడ్ కి ఓ మేలిమి డైరెక్టర్ దొరికిపోయాడని అర్థమైపోయింది.. తొలి సినిమా తోనే హిట్ కొట్టిన అనిల్ ఆ తర్వాత వరుసగా మూడు హిట్ లు కొట్టి టాప్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు..