రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రాధేశ్యామ్ సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్తుండగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండడం విశేషం..