పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ను మొదలుపెట్టి చాలా రోజులే అయినా ఇంకా రిలీజ్ కాకపోవడం అభిమానుల్లో కొంత అసంతృప్తి ని కలగజేస్తుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు జగగకపోయినా ఆ తర్వాత మొదలుపెట్టిన అన్ని సినిమాలకు గుమ్మడికాయ కొట్టేశారు.. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ప్రేక్షకులకు రోజు రోజు కి అసహనం ఎక్కువైపోతుందని అంటున్నారు..ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ సినిమా తో దర్శకుడిగా పరిచయమై మంచి మార్కులు కొట్టేసి వేణు శ్రీరామ్ దర్శకుడు..