టాలీవుడ్ లో అతితక్కువ సమయంలో స్టార్ హీరో అయిన నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో తన పదో సినిమా చేస్తున్నాడు.. అయన కెరీర్ లో ఎప్పటికి నిలిచిపోయే సినిమా అర్జున్ రెడ్డి కాగా ఎవడె సుబ్రహ్మణ్యం సినిమా తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడనేది వాస్తవం.. ఈ సినిమా తర్వాత పెళ్లి చూపులు సినిమా తో హీరో గా పరిచయమై టాలీవుడ్ దృష్టి ని ఆకర్షించాడు.. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి ట్రెండ్ సృష్టించిందో అందరికి తెలిసిందే.. హీరో విజయ్ ని స్టార్ హీరో గా నిలబెట్టిన సినిమా..