టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు ఎవరంటే త్రివిక్రమ్ అని చెప్పాలి.. ఆయనతో సినిమా చేయాలనీ అందరు హీరోలు అనుకుంటారు.. ఒక్కొక్క హీరో ఆయనతో అరడజను సినిమాలు చేయాలనీ కోరుకుంటారు.. ఆ కోవలోనే ఎన్టీఆర్ తన రెండో సినిమాను అయన తో చేస్తున్నారు.. అల్లు అర్జున్ అయితే ఇప్పటికే మూడు సినిమా చేసేశాడు. పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ మూవీస్ చేశాడు. మహేష్ కూడా రెండు సినిమా లు చేసి మరో సినిమా చేయడానికి ఆసక్తి గా ఉన్నాడు.. అయితే త్రివిక్రమ్ దర్శకత్వం చేయడానికి ముందు రచయిత గా చాలా సినిమాలు చేశాడని అందరికి తెలుసు..