కరోనా కారణంగా థియేటర్లు మూసివేయబడి ఇటీవలే తెరుచుకున్నాయి. అయితే ధియేటర్స్ తెరుచుకున్నాయి కానీ ఇంకా ప్రేక్షకులు, సినిమాలు థియేటర్లకు మునుపటిలా రావడం లేదు. సినిమా నిర్మాతలు ఎక్కడ తమ కలెక్షన్లు తగ్గుతాయో అని సినిమా లు రిలీజ్ చేయడం లేదు.. ప్రేక్షకులు ఏ సినిమా వస్తుందో అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. అయితే ఏదైనా పెద్ద సినిమా థియేటర్లలోకి వస్తే తప్పా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. అందుకు తగ్గట్లే టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ను థియేటర్లలో రిలీజ్ చేయాలనీ చూశారు.. కానీ తెలంగాణ లో గ్రేటర్ ఎలక్షన్స్ ఈ ప్లాన్ కి దెబ్బ కొట్టింది..