దొరసాని సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమా తోనే నటనకు ఆస్కారం ఉన్న చిత్రం లో నటించి ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు మలుచుకున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ లోకి వచ్చిన ఆనంద్ తన రెండో ప్రయత్నంగా మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా ను చేస్తున్నాడు.. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా పాటలు, ట్రైలర్ లు సినిమా పై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా బిగిల్ సినిమా లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం నవంబర్ 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కి మంచి టాక్ వచ్చింది..