టాలీవుడ్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాల శైలి కొత్తగా ఉంటుంది. షాక్ సినిమా తో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైనా హరీష్ శంకర్ ఆ తరవాత సినిమాగా రవితేజ తోనే మిరపకాయ్ సినిమా చేసి హిట్ అందుకున్నాడు..ఆ వెంటనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అయితే అంత పెద్ద హిట్ ఇచ్చినా కూడా హరీష్ శంకర్ ని దురదృష్టం ఎదురైందని చెప్పాలి.. ఆ హిట్ సినిమా తర్వాత హరీష్ శంకర్ కి పెద్ద హీరోల దగ్గరినుంచి పిలుపు రాలేదు.. సాయిధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా చేసి ఆ తర్వాత అల్లు అర్జున్ తో DJ తో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు.. ఇటీవలే గద్దలకొండ గణేష్ సినిమా తో హిట్ కొట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తన రెండో సినిమా చేయబోతున్నాడు..