నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో BB3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. సయేశా సైగల్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.. థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ కు ప్రేక్షకులనుండి మంచి స్పందన వచ్చింది. ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం.