మహేష్ బాబు సినిమా కంటే ఎక్కువగా ఫ్యామిలీ తో గడుపుతాడన్న సంగతి అందరికి తెలిసిందే.. చేస్తున్న సినిమా ని పక్కన పెట్టి అయినా సరే ఫ్యామిలీ తో వెకేషన్ కి వెళ్లి వస్తుంటాడు. ఇటీవలే ఫ్యామిలీ తో వెకేషన్ వెళ్లిన మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ లో త్వరలో పాల్గొననున్నాడు. గీత గోవిందం లాంటి క్లాసిక్ హిట్ కొట్టిన పరశురామ్ ఈ సినిమా కి దర్శకుడు. చాల వెరైటీ గా ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు.. మహేష్ బాబు కెరీర్ లోనే వెరైటీ కథగా రాబోతున్న ఈ సినిమా కి పరశురామ్ టాలీవుడ్ లో ఇంతవరకు రానటువంటి స్టోరీ తో చేస్తున్నాడట.. సరిలేరు నీకెవ్వరూ సినిమా సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు సుకుమార్ ని కాదని మరీ చేస్తున్న ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని మహేష్ బాబు కూడా సినిమా పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడట..