తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్ర ఎంతో ముఖ్యమైంది.. విలన్ రోల్ ఎంత ఎలివేట్ అయితే హీరో పాత్రకు అంత ఇంపాక్ట్ ఉంటుందనేది ఇక్కడి వారి నమ్మకం. ఆమధ్య విలన్ అంటే క్రూరంగా, బూర మీసాలు వేసుకుంటూ ఉండేవారు కాలక్రమేణా సినిమాల స్టైల్స్ మారాయి.. స్టైలిష్ గా కూడా విలన్ లు ఉంటూ సినిమాల్లో ప్రేక్షకులను అలరిస్తున్నారు.. అంతేకాదు హీరో సైతం విలన్ పాత్రలు చేయడానికి మొగ్గు చూపుతున్నారంటే విలన్ పాత్ర ఎంత ముఖ్యమంది అర్థం చేసుకోవచ్చు.. తాజగా హీరో అరవింద్ స్వామి తెలుగులో మరో సినిమాలో విలన్ గా చేయడానికి ఒప్పుకున్నారు.. ధృవ సినిమా లో విలన్ గా కనిపించి మంచి మార్కులు కొట్టేసిన అరవింద్ స్వామి మరో తెలుగు సినిమా ను ఒప్పుకోవడం విశేషం.