తమిళ స్టార్ హీరో సూర్య కు తెలుగు లోనూ మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే.. అయన నటించిన ప్రతి సినిమా ఇక్కడ రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడు. గజినీ సినిమా తో తెలుగులో తెరంగేట్రం చేసిన సూర్య అప్పటినుంచి అన్ని సినిమా లు విడుదల చేసి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.. గజినీ తో తెలుగులో తనకంటూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు సూర్య. దాదాపు తెలుగు స్టార్ హీరోల రేంజ్ ఆయనకు ఇక్కడ ఉందని చెప్పొచ్చు. ఇటీవలే అయన నటించిన ఆకాశం నీహద్దురా సినిమా సూపర్ హిట్ అయ్యింది.. అమెజాన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు గెల్చుకుంది..