టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవలే అల్లు అర్జున్ అలవైకుంఠపురం అనే సినిమాతో టాప్ మోస్ట్ హిట్ హిట్ ని అందుకున్నాడు. ఈసినిమా తరవాత ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయితే స్క్రిప్ట్ పనులు జరుపుకుంది కానీ షూటింగ్ కి మాత్రం వెళ్ళలేదు.. ఎన్టీఆర్ RRR షూటింగ్ లో ఉండడంతో షూటింగ్ లేట్ అవుతుంది.. అయితే టైం వేస్ట్ చేయకుండా కాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేసి పనిలో ఉన్నాడు త్రివిక్రమ్.. ప్రస్తుతం ఈ సినిమా కి హీరోయిన్ ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు. త్రివిక్రమ్.. హీరోయిన్స్ ని ఎక్కువగా రిపీట్ చేసే త్రివిక్రమ్ ఈ సినిమా కి కూడా పూజ హెగ్డే ని తీసుకుందామని అనుకున్నాడు..