కమర్షియల్ సినిమాల్లో కామెడీ ని జోడించి హిట్ సినిమాలు చేసిన దర్శకులు టాలీవుడ్ లో కొంతమందే ఉన్నారని చెప్పొచ్చు..ఆలా టాలీవుడ్ కి దొరికిన అతి కొద్దీ మంది దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పటాస్ సినిమా హిట్ రావడంతోనే టాలీవుడ్ కి ఓ మేలిమి డైరెక్టర్ దొరికిపోయాడని అర్థమైపోయింది.. తొలి సినిమా తోనే హిట్ కొట్టిన అనిల్ ఆ తర్వాత వరుసగా మూడు హిట్ లు కొట్టి టాప్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు..రాజా ది గ్రేట్, F2 , సరిలేరు నీకెవ్వరూ వంటి చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా పెద్ద పెద్ద హీరోలతో సినిమా చేస్తాడని మంచి కితాబు కూడా దక్కించుకున్నాడు..