ఎఫ్3 ఎలా ఉండబోతోందన్న దాని మీద కొన్ని లీకులు వస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో మొగుడు పెళ్లాల సరదాలు అల్లరితో గడిచిపోవడంతో ఈసారి పిల్లల్ని ప్రవేశపెట్టబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే వెంకటేష్ కు మాత్రమే సంతానాన్ని పెట్టి వాళ్ళ వల్ల వరుణ్ తేజ్ జంట ఇబ్బందులు పడటాన్ని ఇందులో చూపించవచ్చని అంటున్నారు. ఇదేమి అనిల్ అధికారికంగా చెప్పింది కాదు కానీ నిజమైనా కూడా మంచి ఎంటర్ టైన్మెంట్ కు ఢోకా లేనట్టే. మూడో హీరో కూడా ఉండొచ్చనే టాక్ వచ్చింది కానీ అందులో వాస్తవం ఉండకపోవచ్చు.