అక్కినేని నాగార్జున వరుస షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు.. బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటున్న నాగార్జున మరోవైపు సినిమాల షూటింగ్ ని ఏమాత్రం ఆపడంలేదు.. అంతేకాదు వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటికే వైల్డ్ డాగ్ చిత్రాన్ని అంగీకరించి సెట్స్ మీదకు తీసుకెళ్లిన నాగార్జున మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది. నాగార్జున చేస్తున్న గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి.. రాజిగారి గది 2 పర్వాలేదనిపించుకున్నా ఆఫీసర్, దేవదాస్, మన్మధుడు 2 సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి..