ఇటీవలే ఈ సినిమా కథ లీక్ అయ్యిందంటూ కొన్ని పోస్ట్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమా లో సీతారామరాజు బాగా చదువుకుంటాడు. బ్రిటిషర్ల రూలింగ్ లో, వాళ్లకు అనుకూలంగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ, సక్రమంగా లీగల్ పద్ధతుల్లో దేశానికి స్వతంత్రం తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ భీమ్ మాత్రం యుద్ధంతోనే స్వతంత్రం వస్తుందని నమ్ముతాడు. తన తండా జనాలకు యుద్ధరీతులు నేర్పుతూ, గొరిల్లా దాడులతో ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నిస్తుంటాడు. ఒక దశలో కొమరం భీమ్ ను రామ్ చరణ్ అరెస్ట్ చేస్తాడు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో సీతారామరాజు-భీమ్ కలుస్తారు. ఈ స్టోరీ సోషల్ మీడియా లో తెగ సర్క్యులేట్ అవుతుండగా దీన్ని ఆప్ ప్రయత్నం చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్..