మంచు విష్ణు హీరో గా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఢీ సినిమా కి కొనసాగింపుగా ఢీ & ఢీ అనే సినిమా ని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.. సరిగ్గా 13 సంవత్సరాలక్రితం వీరి కాంబో వచ్చిన ఢీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. మళ్ళీ ఈ సినిమా ని టచ్ చేయడం వీరికే చెల్లిది.. గత కొన్ని సినిమా లుగా శ్రీనువైట్ల సినిమాలు అన్ని ఫ్లాప్ లుగా నిలిచాయి. ఆగడు, బ్రుస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా వరుస సినిమా లు ఫ్లాపులు గా నిలిచాయి..దాంతో చాలా గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమా చేస్తున్నాడు.