సరిలేరు నీకెవ్వరూ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే పూజ కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి తమన్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైనేమెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.. వాస్తవానికి ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ మొదలై ఉండాలి.. కానీ కరోనా వల్ల కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోతే మరి కొన్ని రోజులు మహేష్ బాబు అమెరికా పయనం వల్ల ఆగిపోయింది..