టాలీవుడ్ లో ప్రస్తుతం తన సంగీతంతో ఉర్రుతలూగిస్తున్న సంగీత దర్శకుడు తమన్.. ఒక్కసారి గా తన మ్యూజిక్ తో ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లందరిని దాటేసిపోయాడు.. ఏ పెద్ద హీరోకైనా తమన్ ఉండాల్సిందే.. తమన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అయినట్లే అన్న పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ సిచువేషన్ లో ఉండేవాడు కానీ తమన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటినుంచి పరిస్థితి మారిపోయింది.. ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ తర్వాత తమన్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.