అనిల్ రావిపూడి దర్శకత్వంలో F3 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ ఇటీవలే సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన F2 ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే ఫామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమా తో వరుసగా నాలుగో హిట్ కొట్టిన దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచాడు. టాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకులు చాలా తక్కువ ఉన్నారని చెప్పొచ్చు..