మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదట్లో కొన్ని ఫ్లాప్ సినిమాలు చేసినా ప్రస్తుతం వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు.. చిత్రలహరి సక్సెస్ ను ప్రతి రోజు పండగే సినిమా తో కొనసాగించాడు తేజు.. మారుతీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కుటుంబ కథా చిత్రం గా సూపర్ హిట్ గా నిలిచింది. వరుసగా 9 సినిమాల ఫ్లాప్ ల తర్వాత చిత్ర లహరి సినిమా తో తన ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేశాడు.. ఒకరకంగా ఈ సినిమా తేజు కు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది అని చెప్పుకోవాలి..