దగ్గుబాటి వారినుంచి మరో హీరో ఎంట్రీ కాబోతున్నాడని టాలీవుడ్ అంతటా కోడై కూస్తుంది.. రామానాయుడు వారసులుగా సురేష్ బాబు, వెంకటేష్ బాబులు ఇప్పటికే టాలీవుడ్ లో మంచి ప్లేస్ లో ఉన్నారు.. హీరో గా వెంకటేష్ ఓ రేంజ్ లో ఉంటే నిర్మాతగా సురేష్ బాబు టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు.. ఇక వారి వారసుడిగా దగ్గుబాటి రానా టాలీవుడ్ లో సృష్టిస్తున్న ప్రభంజనం సంగతి అందరికి తెలిసిందే. బాహుబలి సినిమా తో దగ్గుబాటి వారి పేరు ను దేశవ్యాప్తంగా వినిపించేలా చేశాడు..