ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం కేజిఎఫ్..ఈ సినిమా తో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. తన కెరీర్ లో రెండో సినిమా తో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకునేలా చేశాడనడం లో ఎలాంటి సందేహం లేదు.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది అని చెప్పొచ్చు.. కేజిఎఫ్ సినిమా వచ్చె అంతవరకు కన్నడ సినీ పరిశ్రమను కుటీర పరిశ్రమగా భావించేవారు సినీ లోకం..