సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నాడు హీరో సాయి ధరమ్ తేజ్..లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. సుబ్బు ఈ సినిమా కి దర్శకుడు కాగా నభ నటేష్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.. వరుసగా రెండు హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్న సాయి ధరం తేజ్ ఈ సినిమాతోనూ హిట్ కొట్టి హ్యాట్రిక్ పై కన్నేశాడు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్ లు సినిమా పై అంచనాలను పెంచేలా చేశాయి. ట్రైలర్ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేయగా ఈ సినిమా హిట్ అనే టాక్ ఎక్కువ వినిపిస్తుంది.