నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలను సెట్స్ మీద ఉంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాధే శ్యామ్ ని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఆ తర్వాత సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ల సినిమాలు చేయాలని చూస్తున్నాడు.. సాహో సినిమా ఫ్లాప్ తర్వాత రాధే శ్యామ్ విషయంలో మరిన్ని జాగ్రతలు తీసుకుంటున్నాడు ప్రభాస్. ఈ సినిమా కి సంబంధించి స్క్రిప్ట్ ని మార్పించి మరీ సినిమా ని రీ సూటి చేయిస్తున్నాడు.. అందుకే సినిమా ఇంత ఆలస్యమవుతూ వచ్చింది..