టాలీవుడ్ లో దర్శకుల ప్రతిభ కు కొదువలేదు. కొత్త కొత్త ఆలోచనలు, కథలు రాయడంలో దేశంలోనే టాలీవుడ్ లో మంచి మంచి దర్శకులు ఉన్నారు.. సౌత్ నుంచి ఎక్కువగా టాలీవుడ్ సినిమాలే ఇతరభాషల్లో రీమేక్ అవుతున్నాయి అంటే మన రచయితలు, దర్శకుల ప్రతిభ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.. బాహుబలి సినిమా తో టాలీవుడ్ భవిష్యత్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు.. హిందీ మార్కెట్ లో టాలీవుడ్ సినిమాలకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి..ఇతర భాషల రైట్స్ కూడా ఓ రేంజ్ లో అమ్ముడు పోతున్నాయి.