మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో చేస్తున్న సంగతి తెలిసిందే.. సైరా లాంటి సూపర్ హిట్ తర్వాత మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో నటిస్తున్నారు.. కొరటాల శివ దర్శకుడు.. మెసేజ్ ని కమర్షియల్ సినిమాలకు జోడించి మంచి హిట్లు కొట్టే కొరటాల శివ ఈ సినిమా లోనూ అలాంటి మెసేజ్ ని ఇమిడించి పక్కా మాస్ మసాలా సినిమా ని తెరకెక్కిస్తున్నాడట.సినిమాల విషయంలో, కథ విషయంలో, డైరెక్టర్ ల విషయంలో చిరు ఎంత శ్రద్ధగా ఉంటాడో అందరికి తెలిసిందే.. కథ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ సినిమా ని పక్కనపెట్టేయడంలో ఎలాంటి ఆలోచన చేయదు..