కన్నడ ఇంస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ చైర్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.. టాలీవుడ్ లో ప్రస్తుతం ఆమెకు ఉన్నన్ని సినిమాలు ఏ హీరోయిన్ కి లేవు.. సీనియర్ హీరోయిన్ లు కూడా ఫేడ్ అవుట్ అవుతున్న క్రమంలో మరిన్ని అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి... ఛలో సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా గీత గోవిందం తో సూపర్ హిట్ అందుకుంది.. ఆ విజయం తో ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు.