ఇప్పుడు ఉన్న యంగ్ హీరోల్లో క్లారిటీ, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరో ఎవరంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని చెప్పాలి. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడ్డా ప్రస్తుతం తన మార్కెట్ పరిధిలో సినిమాలు చేస్తూ ఇమేజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. వరుణ్ తేజ్ గత కొన్ని సినిమాలు మంచి హిట్ లు కొదవుతున్నాడు. మూస కథలని కాకుండా వెరైటీ కథలను ఎంచుకుంటూ వాటినుంచి హిట్ కొడుతున్నాడు.