కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో హీరో గా వెళ్లి సునీల్ తప్పు చేశారని చాలామంది అభిప్రాయపడ్డారు. హీరో అయ్యాక ఒకటి రెండు సినిమాల్లో తప్ప సునీల్ పెద్ద గా ఈ సినిమాల్లో ప్రభావం చూపించలేకపోయారు. నిజానికి ఉన్న ఇమేజ్ ని తగ్గించుకున్నారు. బరువు హెచ్చు తగ్గుల విషయంలో అయన సరిగ్గా ఇంట్రెస్ట్ పెట్టకపోవడంతో ఆయనను ప్రేక్షకులు స్క్రీన్ పై చూడలేకపోయారు. కమెడియన్ గా చేస్తూ హీరోగానూ చేస్తూ ఉంటే బాగుండేదని అప్పట్లో అందరు అభిప్రాయపడ్డారు.