యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా తో హిట్ కొట్టి ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా లో నటిస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని రాజమౌళి చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ ఇటీవలే అల్లు అర్జున్ అలవైకుంఠపురం అనే సినిమాతో టాప్ మోస్ట్ హిట్ హిట్ ని అందుకున్నాడు. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పనులు జరుపుకుంది కానీ షూటింగ్ కి మాత్రం వెళ్ళలేదు..