మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చెప్పిన మాట ప్రకారం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో థియేటర్లలో రిలీజ్ చేసి హిట్ కొట్టాడు.. కరోనా నేపథ్యంలో అన్ని ధియేటర్ మూసివేయబడి తొమ్మిది నెలలు అవుతున్నాయి. ఈమధ్య తెరుచుకున్నాయి. అయితే జనాలు వస్తారా రారా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడే సాయి ధరమ్ తేజ్ తన సినిమా ను రిలీజ్ చేసి పెద్ద సాహసం చేశాడు. ఇప్పుడు ఆ సాహసమే సినిమా ను హిట్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు.. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తో పరిచయమవుతుండగా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.