సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రాబోతున్న సినిమా లో నటించే విలన్ పాత్ర కు ఎవరిని నటింపచేస్తున్నారో అన్నది సస్పెన్స్ గా ఉంచుతున్నారు.. మొదటి నుంచి రకరకాల పేర్లు వినిపిస్తున్న ఇప్పటికే ఎవరిని ఫైనల్ చేయలేదు.. ఎవరిని ఫైనల్ చేయలేదా చేసి దాస్తున్నారా అన్న విషయం అర్థం కావట్లేదు.. మన తెలుగు సినిమా లో కథానాయకుడు ఎలా ఉన్నా పర్వాలేదు కాని ప్రతినాయకుడు మాత్రం ఓ రేంజ్ లో ఉండాలి. కండలు తిరిగిన బాడీ, కోరమీసం, సిక్స్ ప్యాక్ శరీరం, ఉగ్రమైన కళ్ళు ఇలా ప్రతి ఒక్కటి హీరో కన్నా ఎక్కువ ఉండాలి..