బాహుబలి తో ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోయిన ప్రభాస్ ప్రస్తుతం చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలంటే అయన కెరీర్ ఎంతటి పీక్ స్టేజి లో ఉందొ అర్థం చేసుకోవచ్చు..ఒక్క సినిమా తోనే తన రేంజ్ ని , టాలీవుడ్ రేజ్ ని ఓ రేంజ్ లో పెంచాడు ప్రభాస్. ప్రస్తుతం అయన వరుసగా నాలుగు సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే.. రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకున్న ప్రభాస్ ఇటీవలే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సాలర్ సినిమా ను కూడా అనౌన్స్ చేశాడు. వీటిలో రాధే శ్యామ్ తప్పా మిగితా సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే..