పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా ని దాదాపుగా పూర్తి చేసినట్లే ఉంది.. ఈ వేసవికి సినిమా ను రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాత వేణు శ్రీరామ్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉండగా బాలీవుడ్ లోని పింక్ సినిమా కి ఇది రీమేక్..