టాలీవుడ్ లో మరో యంగ్ డైరెక్టర్ కి స్టార్ డైరెక్టర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనే వెంకీ కుడుముల.. తొలి సినిమా 'ఛలో' తోనే సూపర్ హిట్ కొట్టిన వెంకీ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు..ఓ మామూలు హీరో హీరోయిన్ లతో ఆ రేంజ్ హిట్ కొట్టడం అంటే చిన్న విషయం కాదు.. ఆ కాన్ఫిడెన్స్ తో మీడియం రేంజ్ హీరో అయిన నితిన్ భీష్మ సినిమా చేసి ద్వితీయ విఘ్నం కూడా దాటేశాడు. ఈ సినిమా తో తనపై కొద్దో గొప్పో అనుమానాలు అన్ని ఎగిరిపోయాయి.. వెంకీ కుడుముల కి తప్పకుండా స్టార్ డైరెక్టర్ అయ్యే ఫ్యూచర్ ఉందని ఫిక్స్ అయ్యాడు..