భారి సెట్లకు పెట్టింది పేరైన గుణశేఖర్ కు కొద్ది రోజులుగా గడ్డు రోజులు నడుస్తున్నాయని చెప్పొచ్చు.. సరైన హిట్లు లేక వచ్చిన ఛాన్సులను సద్వినియోగం చేసుకోక గుణశేఖర్ చివరికి ఓ నార్మల్ డైరెక్టర్ గా మిగిలిపోయాడు.. ఆయన నుంచి నుంచి తెలుగు లో సినిమా వచ్చి చాలా రోజులే అయ్యింది. అప్పుడెప్పుడో రుద్రమదేవి చిత్రం వచ్చిన గుణశేఖర్ నుంచి ఇప్పటివరకు సినిమా రాకపోవడం ఆశ్చర్యం కలిగించేదే..రుద్రమదేవి సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. క్వాలిటీ తగ్గడంతో సినిమా పై పెద్దగా ఎవరు ఆసక్తి చూపలేదు.ఇక ఆ మధ్య హిరణ్య కశ్యప అనే సినిమా తో కొంత హడావుడి చేసిన ఆ సినిమా ఆగిపోయినట్లు అనిపిస్తుంది..