తొలి సినిమా తో అంతగా గుర్తింపు దక్కించుకోకున్నా రెండో సినిమా ఇస్మార్ట్ శంకర్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది నభ నటేష్. ఈ సినిమా లో ఆమె నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు.. ఒక్క సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపొయింది అనుకోవచ్చు. టాలీవుడ్ లో హీరోయిన్ ల టాప్ చైర్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ప్రేక్షకులు ఫ్రెష్ పేస్ లు కోరడంతో పాటు కొత్త వారిని ప్రోత్సహించే వారు ఎక్కువగా ఉండడంతో ప్రతి పదేళ్లకు ఓ హీరోయిన్ టాప్ చైర్ లో ఉంటుంది..